రాష్ట్రంలో నూతనంగా నెలకొల్పనున్న సమక్క-సారక్క జాతీయ గిరిజన వర్సిటీలో రాబోయే ఏడేండ్లలో 2,790 యూజీ, పీజీ సీట్లు లభ్యమవుతాయని కేంద్ర విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రూ.889.07 కోట్లతో ములుగు జిల్లాలో ఈ వర్సిటీ ఏర్పాటుకు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 11 డిపార్ట్మెంట్లతో ఏర్పాటయ్యే 5 స్కూళ్లలో వివిధ కోర్సులను నిర్వహిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులను నిర్వహించనున్నారు. తొలుత తాత్కాలిక క్యాంపస్‌లో ఈ వర్సిటీని ప్రారంభించనుండగా, నూతన వైస్ చాన్స్‌లర్‌ను కేంద్రం నియమించాల్సి ఉంటుంది. సీయూఈటీ (యూజీ), సీయూఈటీ (పీజీ) ప్రవేశ పరీక్షల ద్వారా ఈ వర్సిటీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
👉 – Please join our whatsapp channel here –