Politics

కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు రద్దు చేయాలి!

కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు రద్దు చేయాలి!

కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్త్రత సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్ పోర్టులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందరూ దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే… నెలాఖరులో 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనం ఉండనుందని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z