కాకతీయ కాలువ (లోయర్ మానేరు డ్యాం పైన) పరిధిలోని ఆయకట్టుకు ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేయనున్నారు. జోన్-1 ఆయకట్టుకు మొదటి ఏడు రోజులు, తర్వాత ఎనిమిది రోజులు జోన్-2 ఆయకట్టుకు ఆన్ ఆఫ్ పద్ధతిలో యాసంగి పంటకు సాగునీరు ఇవ్వనున్నామని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పోచంపాడు సర్కిల్ ఎస్‌ఈ జీ.శ్రీనివాస్ ప్రకటించారు. శ్రీరామ్ సాగర్‌లో గతేడాది కన్నా నీటి సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –