Politics

క్రిస్మస్ కానుక ప్రకటించిన సర్కార్

క్రిస్మస్ కానుక ప్రకటించిన సర్కార్

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ప్రజాభవన్‌లో వేడుకల నిర్వహణ కమిటీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి పండగ అయినందున ఈ వేడుకలు ఘనంగా జరగాలని సూచించారు.

పేద కుటుంబాలకు క్రిస్మస్‌ సందర్భంగా గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్రత్యేక విందుకి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మంది, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేయడంతోపాటు విందు ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు.

గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా క్రిస్మస్, రంజాన్, దసరా సందర్భంగా పేద వర్గాలకు కానుకను ప్రకటించేది. దసరాకు పేద మహిళలకు బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్‌లకు పేదలకు బట్టలు పంపిణీ చేసేవారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ.. కొత్త ప్రభుత్వం కూడా పండుగల సందర్భంగా పేదలకు కానుకను ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z