ScienceAndTech

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీలు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీలు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా స్మార్ట్‌ ట్రాలీని ప్రవేశపెట్టినట్లు జీఎంఆర్‌ అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రాలీలో స్మార్ట్‌ స్ర్కీన్‌తో పాటు విమానం ఏ సమయానికి బయలుదేరుతుంది.. ఎంతో దూరంలో ఉన్నాం.. ఏ షాపింగ్‌ మాల్‌ ఎక్కడ ఉంది అనే విషయాలు పొందుపర్చినట్లు తెలిపారు. అరైవల్‌ నుంచి డిపార్చర్‌ వరకు వీటిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. రప్రయాణికులకు విలువైన సమాచారాన్ని ఈ ట్రాలీలు అందిస్తాయని, దేశంలోనే ప్రథమంగా ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ 40 ట్రాలీలు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు మరిన్ని స్మార్ట్‌ ట్రాలీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z