అత్యంత ఖరీదైన కాకాసియన్ షెపెర్డ్ (caucasian shepherd) జాతి కుక్క నగరంలోని మియాపూర్‌లో కనిపించింది. శనివారం మియాపూర్‌లోని విశ్వ పెట్ క్లినిక్‌కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్ ఇటీవల కాకాసియన్ షెపెర్డ్ (caucasian shepherd) జాతికి చెందిన శునకాన్ని రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. ఆ శునకానికి కాడాబామ్ హైడర్ అనే పేరు కూడా పెట్టారు. ఈ శునకం సినిమాల్లో నటిస్తోందని.. అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని యజమాని సతీశ్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగే డాగ్ షో కోసం శునకాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. కాడాబామ్ హైడర్ మియాపూర్‌కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా ఎగబడ్డారు. దానితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.
శునకాలను ఎంతో ఇష్టపడే సతీశ్ గతంలోనూ పలు జాతుల కుక్కలను రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ఇప్పటికే రూ.10కోట్ల టిబెటన్ మస్తిఫ్, రూ.8కోట్ల అలస్కన్ మాలామ్యూట్, రూ.కోటి విలువ గల కొరియన్ డోసా మస్తిఫ్ జాతి కుక్కలున్నాయి. ఈ శునకాలను తాను మహారాజులా చూసుకుంటానని సతీశ్ చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –