Business

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి ఐడీ కార్డును పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలని స్పష్టం చేశారు. ఐడీ కార్డు చూపితేనే జీరో టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. లేదంటే డబ్బులు పెట్టి టికెట్‌ తీసుకోవాలని, టికెట్‌ తీసుకోకపోతే రూ.500 ఫైన్‌ వేస్తామని హెచ్చరించారు.

ఇటీవల ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌.. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. ఈ పథకం డిసెంబర్‌ 9న ప్రారంభించబడింది. ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. మొదటి రోజు కాస్తా వెసులుబాటు కల్పించగా, శనివారం నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z