హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు నిర్వహించారు.
సదస్సును నందిని సిధారెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్ లు ప్రారంభించారు.
టీవీ ప్రసారాలు అప్పుడు ఇప్పుడు అనే అంశంపై శాంతి స్వరూప్, శ్రోతల జీవితాన్ని నిర్దేశించిన రేడియో ప్రసారాలు అనే అంశంపై అయినంపూడి శ్రీలక్ష్మి, నూతన మాధ్యమాలు సత్యాసత్యాలు అనే విషయంపై కే శ్రీనివాస్, ఇవాల్టి తెలుగు పరిశోధకులకు మార్గదర్శనాలు అనే అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్, సాంకేతిక యుగంలో సాహిత్యం పాత్ర అనే అంశంపై స్వామి ముద్దం, అనువాదం నాటకం అవధానం అనే అంశాలపై పలువురు నిష్ణాతులు తమ పరిశోధనలకు సంబంధించిన సాహిత్య చర్చలు నిర్వహించారు.
తెలుగు కథ, నవల, ఆధునిక కవితా వికాస పరిణామాలు, గేయ సాహిత్యం సినిమా సాహిత్య మేలవింపు వంటి పలు అంశాలపై వెల్దండి శ్రీధర్, యాకూబ్ గోరటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ దేశపతి శ్రీనివాస్ కాసర్ల శ్యామ్, పసునూరి రవీందర్, అల్లాని శ్రీధర్, మంత్రి శ్రీదేవి జూలూరి గౌరీ శంకర్, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.