సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీఎస్ హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎలా బయటపడాలి, నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై వీళ్లు చర్చించినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –