అరుదైన వ్యాధితో బాధపడుతున్న 15 నెలల బాలుడిని కాపాడటానికి రూ.17 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అవసరమైంది. కానీ చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు. ఆ బాలుడిని కాపాడటానికి విరాళాల కోసం ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని చేపట్టారు. దానికి స్పందిస్తూ పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చారు. వారితోపాటు కేంద్రం, ఔషధ సంస్థ నొవార్టిస్ అండగా నిలవడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పుర్‌కు చెందిన ఆ బాలుడే 15 నెలల భూదేవ్. ఆ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫి-టైప్1 అనే అరుదైన వ్యాధి సోకింది. రూ.17 కోట్ల ఇంజెక్షన్‌కు అవసరమైన డబ్బు కోసం ‘సేవ్ భూదేవ్’ పేరుతో ఆన్‌లైన్ ప్రచారం చేపట్టగా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. నొవార్టిస్ సంస్థ కూడా అతడికి సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్‌కు దిగుమతి సుంకం మినహాయించింది. దీంతో దాని ధర రూ.10 కోట్లకు దిగివచ్చింది. ఈ ఇంజెక్షన్‌ను దిల్లీ ఎయిమ్స్ వైద్యులు బాలుడికి ఇచ్చారు. ప్రస్తుతం భూదేవ్‌ను ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –