కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఈ-సిగరెట్లు, వేడిచేసిన పొగాకు ఉత్పత్తుల (హెచ్‌టీపీలు)పై పరిశోధనలు చేపట్టొద్దని వైద్యులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఈ నెల 15న ఈ మేరకు బహిరంగ నోటీసు జారీ చేసింది. ఎన్‌ఎంసీ, భారత వైద్య సంఘం (ఐఎంఏ) అనుబంధ ఆరోగ్యరంగ నిపుణులెవరూ ఈ-సిగరెట్లు, హెచ్‌టీపీలపై పరిశోధనలు చేపట్టకుండా నిలువరించాలని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ ఎన్‌ఎంసీకి ఈ నెల 8న లేఖ రాశారు. మన దేశంలో వాటి ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రచారంపై నిషేధం అమల్లో ఉన్న సంగతిని అందులో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ తాజా ఆదేశాలు జారీ చేసింది.
👉 – Please join our whatsapp channel here –