మ్యాజికల్ కాంబో- మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిందో.. లేదో, వరసగా అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. శనివారం హీరోయిన్‌ని పేరు, ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. ఆదివారం సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేశారు. అంతేకాదు, ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని కూడా మేకర్స్ వదిలారు. మాస్ మహారాజా రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరనే విషయం తెలిసిందే. తన కొన్ని సినిమాలలో బిగ్ బిని అనుకరిస్తూ అలరించారు కూడా. ఇప్పుడు హరీష్ శంకర్‌తో రవితేజ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్‌లో రవితేజ.. అమితాబ్ బచ్చన్ (Big B Amitabh Bachchan) ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లుగా ప్రజెంట్ చేస్తోంది.
ఈ లుక్‌లో రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు. అతను సినిమా లవరా? సినిమాలో అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానా? ‘బిగ్ బి-నామ్ తో సునా హోగా’ అనే పాపులర్ డైలాగ్ ఈ సినిమా ట్యాగ్‌లైన్. టైటిల్ పోస్టర్ మాస్, అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది.
ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. (Mr Bachchan Launched Grandly)
ఆదివారం పలువురు అతిధుల సమక్షంలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. హీరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘు రామకృష్ణ స్క్రిప్ట్‌ను దర్శకుడు హరీష్ శంకర్‌కి అందజేశారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కుమార్ మంగత్ పాఠక్ క్లాప్ కొట్టగా, కె రఘు రామకృష్ణం రాజు, టిజి భరత్ కలిసి కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం షాట్ కోసం “మిస్టర్ బచ్చన్… నామ్‌తో సునా హోగా!” డైలాగ్‌ని చెప్పారు రవితేజ. కాగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –