హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 54 టెక్నీషియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కొలువుల కోసం https://www.nrsc.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
మొత్తం పోస్టులు 54 కాగా.. టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్, మెకానిక్) 33 పోస్టులు.. ఎలక్ట్రికల్‌లో 8; ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 9; ఫొటోగ్రఫీ, డీటీపీ ఆపరేటర్ రెండు పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: లెవెల్ -3 పే కింద నెలకు రూ.21,700- రూ.69,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తులు: డిసెంబర్ 31 సాయంత్రం 5గంటల వరకు చేయవచ్చు. ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవే.. కానీ కొనసాగించే అవకాశాలు ఉంటాయి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. అయితే, ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 80 ప్రశ్నలు అడుగుతారు. 1.50గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానం రాస్తే 0.33 మార్కులు కోత విధిస్తారు. స్కిల్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో తుది జాబితా ఆధారంగా స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్. మరింత సమాచారం ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.
👉 – Please join our whatsapp channel here –