ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసి అవార్డు వివరాలను ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.ఇటీవల న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అధికారులు అవార్డును అందుకున్నారు. వరుసగా రెండేళ్ళలో రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకుని ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు,ఏపీ ట్రాన్స్కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీఏవీపీ కుమారరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.
👉 – Please join our whatsapp channel here –