విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే టోఫెల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి అందరికీ కామన్‌గా కాకుండా వ్యక్తిగత అవసరాన్ని బట్టి.. రాసేవారి పూర్వాపరాలను బట్టి పరీక్ష ఉంటుంది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. పరీక్షలో కృత్రిమ మేధను వినియోగించుకుంటామని చెప్పారు. ‘పరీక్షలో పక్షపాతం లేకుండా చూడాలనుకుంటున్నాం. ఉదాహరణకు జర్నలిజం కోర్సు చదవాలనుకునే అభ్యర్థి ఉన్నత స్థాయిలో భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇతర కోర్సులకు అంతగా అవసరం ఉండదు. దానిని బట్టి టోఫెల్ ఉంటుంది’ అని వివరించారు.
👉 – Please join our whatsapp channel here –