Devotional

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో ఆర్జిత సేవలను అధికారులు రద్దుచేశారు. భక్తులకు వేగంగా దర్శనభాగ్యం కల్పించేందుకు కృషిచేస్తున్నారు. కాగా, మొక్కులు తీర్చుకోవడానికి పలువురు భక్తులు కోడెలను తీసుకొచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z