అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం – 2023
ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న, ప్రపంచం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా గుర్తింపబడుతుంది, ఇది వలసదారుల మధ్య ఉండే అమూల్యమైన సహకార సంబంధానికి ప్రతీకగా మరియు వారి హక్కులు మరియు శ్రేయస్సు కోసం నిలబడే రోజుగా వేడుక చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సవాళ్లను గుర్తించే దిశగా ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం థీమ్, “సురక్షిత వలసలను ప్రోత్సహించడం”, అందరిని కలుపుకొనిపోయే కమ్యూనిటీలను పెంపొందించడంలో ఐక్యత మరియు సహకారం యొక్క శక్తి ప్రతిబింబిస్తున్నప్పుడు అది లోతుగా ప్రతిధ్వనిస్తుంది. ఈ థీమ్ ప్రపంచవ్యాప్తంగా వలసదారులు మరియు స్థానభ్రంశం చెందిన వ్యక్తులు తరచుగా అనుభవించే అవకాశాలు మరియు మినహాయింపులను కూడా నొక్కి చెబుతుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, వలసదారులు తమ మూలాలు, మరియు గమ్యమై ఉన్న దేశాల శ్రేయస్సుకు, మరియు స్థిరమైన అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ సంస్థలు సంయుక్తంగా కార్మికుల వలసదారుల కోసం 17 డిసెంబర్ 2023న జలాన్ పాపన్లోని టెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో సింగపూర్ ప్రభుత్వ మానవ వనరులశాఖ, నిర్వహించిన అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం 2023లో భాగమయ్యారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది కార్మిక సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమములో పాల్గొన్న కార్మిక సోదరుల కోసం ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీ నిర్వహించి 25 మంది విజేతలకు బహుమతులు అందచేశారు అలాగే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తెలంగాణ వంటలు(సకినాలను) అందరికి అందించారు.
ఈ కార్యక్రమములో శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు సుధాకర్ జొన్నాదుల, శ్రీధర్ భరద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు మామిడాల ప్రవీణ్, పేరుకు శివరామ్ ప్రసాద్, మరియు విజయ మోహన్ వెంగళ తదితరులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమములో ఉత్సాహంగా భాగస్వామ్యులు అయిన శ్రీ సాంస్కృతిక కళాసారథి మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ సంస్థలను సింగపూర్ ప్రభుత్వ మానవ వనరులశాఖ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –