DailyDose

ఒకే ఇంట్లో ఆరుగురు హత్య-నేర వార్తలు

ఒకే ఇంట్లో ఆరుగురు హత్య-నేర వార్తలు

* ఒకే ఇంట్లో ఆరుగురు హత్య

నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్యోదంతం కలకలం రేపుతోంది. ఇంటి కోసం ఇంటిల్లిపాదిని విడివిడిగా ఓ స్నేహితుడు కడతేర్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్య గురైనట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..మొదట నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లూరుకు చెందిన మాక్లూర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని అతని స్నేహితుడు ప్రశాంత్‌ హత్య చేశారు. డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన అతని మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని అతని భార్యను సైతం తీసుకెళ్లి.. బాసర వద్ద గోదావరిలో పడేశారు. ఆపై వారి ఇద్దరు పిల్లలను చంపి పోచంపాడ్‌ సోన్‌ బ్రిడ్జి వద్ద కాలువలో తోసేశాడు. అనంతరం ప్రసాద్‌, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారని.. ప్రసాద్‌ ఇద్దరి చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకెళ్లి హత్య చేశారు. మొదటి మూడు హత్యలను ఒక్కడే చేసిన ప్రశాంత్‌.. తర్వాత ముగ్గురిని స్నేహితులతో కలిసి చంపినట్లు తెలుస్తోంది. హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వరుస హత్యలపై పోలీసుల ఇంకా వివరాలు వెల్లడించలేదు.

తెలంగాణలో దారుణం

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ దుర్మార్గుడు స్నేహితుడి కుటుంబ సభ్యులనే కిరాతకంగా హత్య చేశాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో విడివిడిగా చంపేశాడు. ప్రశాంత్ అనే నిందితుడు మొదట ప్రసాద్ అనే వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన పూడ్చిపెట్టాడు.తర్వాత మక్లూర్‌లోని మృతుడి ఇంటికి వెళ్లి అతని భార్యను తీసుకెళ్లి బాసర వద్దనున్న గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారని అతని ఇద్దరి చెల్లెళ్లను నమ్మించాడు. ఇద్దరినీ సదాశివనగర్‌కు తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఆ తర్వాత చివరకు ప్రసాద్‌ ఇద్దరు పిల్లలను కూడా వదలకుండా పోచంపహాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేసి దారుణంగా చంపేశాడు. ఈ హత్యలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నిందితులు ప్రశాంత్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పాండ్రకవాడ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని.. వైద్య విద్యార్థులు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బాలసాయి, డేవిడ్‌లుగా గుర్తించారు.

బిగ్‌బాస్‌ గొడవపై కేసు నమోదు

 బిగ్‌బాస్‌-7లో రైతు బిడ్డ  పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. అమర్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్‌ ఫాన్స్‌, పల్లవి ప్రశాంత్‌ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్‌ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు.‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్‌ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజీవ్‌గాంధీనగర్‌ వద్ద కారు బీభత్సం

చైతన్యపురి రాజీవ్‌గాంధీనగర్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్‌ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్‌ – ఉప్పల్‌ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మరి అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన

పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్తున్న 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మరి అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని దౌసాలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో 8 వ తరగతి చదువుతుంది. గురువారం ఉదయం పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేశారు. అనంతరం స్కూల్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం ఆ నిందితులు బాలికను పెట్రోల్ పంప్ దగ్గర వదిలి వెళ్లారు.బాలికను చూసిన స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విచారించారు. నిందితుల్లో ఒకడైన సురేష్ మీనా (22) తనకు తెలుసని బాలిక చెప్పింది. సురేష్.. ఇంకో వ్యక్తితో వచ్చి తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. అయితే.. రాత్రంత బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సంప్రదించినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఐపీసీ సెక్షన్ 363, 376, 376 డీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, నిందితులను విచారిస్తున్నామని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z