DailyDose

హైదరాబాద్‌లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం

హైదరాబాద్‌లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం

హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. కాగా.. 30 మంది కోసం ప్రేమ్ చంద్ డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లతో కలిపి పార్టీ అరెంజ్ చేశాడు.

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకు సంబంధించి ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని ఆయన చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z