Business

రెండు వేల పైగా మోసపూరిత రుణ యాప్‌లను తొలగింపు

రెండు వేల పైగా మోసపూరిత రుణ యాప్‌లను తొలగింపు

గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి 2,500 మోసపూరిత రుణ యాప్‌లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జులై మధ్య ఈ చర్యలు తీసుకుందని సోమవారం పార్లమెంటులో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉందని వివరించారు. చట్టబద్ధంగా నడుస్తున్న లోన్‌ యాప్‌ల వివరాలను రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి అందించిందని, ఆ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ గూగుల్‌కు పంపిందని తెలిపారు. గూగుల్‌ తన విధివిధానాలను పటిష్ఠం చేసిందని వెల్లడించారు.కొత్త విధానంలో సమ్మతి పొందిన యాప్‌లనే ఆ సంస్థ ప్లేస్టోర్‌లో అనుమతిస్తోందన్నారు. భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (14సీ), కేంద్ర హోంశాఖ డిజిటల్‌ లోన్‌ యాప్‌లను పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z