పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన(Parliament Security Breach) విషయం విదితమే. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఢిల్లీ ప్రత్యేక విభాగ బృందాలు రాజస్థాన్, హరియాణా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మను దక్షిణ రేంజ్‌లోని స్పెషల్ సెల్ బృందం విచారిస్తోంది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను సౌత్ వెస్ట్రన్ రేంజ్‌లోని జనక్‌పురి స్పెషల్ సెల్ టీమ్‌కు అప్పగించారు.
ఇటీవల, ఈ బృందం రాజస్థాన్‌లోని నాగౌర్లో ధ్వంసమైన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. పోలీసులు 50 బృందాలుగా విడిపోయి వారి డిజిటల్, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత నేపథ్యం తదితర విషయాలను ఆరా తీస్తోంది. నిందితులను వెంట తీసుకెళ్లి దర్యాప్తు కొనసాగిస్తోంది.
మరో నిందితురాలైన నీలం దేవిని ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని స్పెషల్ సెల్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. దీనిని స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని కూడా పిలుస్తారు. నిందితులందరినీ శనివారం స్పెషల్ సెల్‌లోని వివిధ విభాగాలకు అప్పగించారు. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. వారిని తదుపరి విచారణ కోసం NFC స్పెషల్ సెల్ బృందానికి అప్పగిస్తారు.
👉 – Please join our whatsapp channel here –