DailyDose

స్టాఫ్ న‌ర్సు పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

స్టాఫ్ న‌ర్సు పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణలో స్టాఫ్‌నర్సు(Staff Nurse) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా.. దాదాపు 40వేల మంది రాశారు. తాజాగా ఈ పరీక్ష తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసినట్లు టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ప్రకటించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాథమిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను ఈ నెల 20లోపు ఆన్‌లైన్‌లో తెలపవచ్చని సూచించారు. అయితే, అభ్యర్థుల ప్రాథమిక జాబితా (ఫలితాలు) ఇంకా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z