తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్ సైట్ నుంచి ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్ వెంట తల్లి భువనేశ్వరి (Nara Bhuvaneshwari), అత్త వసుంధర (Vasundhara).. ఇతర కుటుంబసభ్యులు కలిసి నడిచారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది.
మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవా నిర్వాహకులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద సాయంత్రం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇవాళ్టితో యువగళం పాదయాత్ర ముగియనుంది. విశాఖ శివాజీనగర్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరిస్తారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. 97 నియోజకవర్గాల్లో సాగింది. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను తెదేపా (TDP) భారీ ఎత్తున నిర్వహించనుంది.
👉 – Please join our whatsapp channel here –