DailyDose

టీఎస్‌ గురుకుల 5వ క్లాస్‌ అడ్మిషన్స్

టీఎస్‌ గురుకుల 5వ క్లాస్‌ అడ్మిషన్స్

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ, వీటీజీ సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలు గో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

విద్యార్థులు జనవరి 6లోగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను సమర్పించాలని, ఫిబ్రవరి11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. వివరాలకు 1800 425 45678 టోల్‌ప్రీ నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z