Politics

పదేళ్లలో సృష్టించిన ఆస్తుల డాక్యుమెంట్‌ను విడుదల చేసిన బీఆర్‌ఎస్

పదేళ్లలో సృష్టించిన ఆస్తుల డాక్యుమెంట్‌ను విడుదల చేసిన బీఆర్‌ఎస్

రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత్‌ రాష్ట్ర సమితి (BRS) ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పొందుపరిచింది. కాగా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే డాక్యుమెంట్‌ను భారాస విడుదల చేసింది. అప్పులపై కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా భారాస వ్యూహం కనిపిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z