లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ డిసెంబర్ 21 నుంచి జనవరి 2 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఉమమహేశ్వరి దేవి ఓ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్లు 21 నుంచి 23, ధ్రువపత్రాల పరిశీలన 22-26, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు 27-29, ఐచ్ఛికాల మార్పు 30 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జనవరి 2న సీట్లు కేటాయించనున్నామని, సీట్లు పొందిన వారు 5 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –