Food

అయ్యప్ప స్వామి ప్రసాదానికి కావలసిన పదార్థాలు

అయ్యప్ప స్వామి ప్రసాదానికి కావలసిన పదార్థాలు

శబరిమల అనగానే గుర్తొచ్చేది ముందుగా అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత స్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులకు కోసం తప్పకుండా ప్రసాదం తీసుకెళ్తుంటారు. తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో శబరిమలలో దొరికే అరవణి ప్రసాదానికి కూడా అంత పేరుంది.

ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తినడానికి రుచిగా ఉండటంతో పాటు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. కేరళలో కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం.

కావల్సిన పదార్థాలు
ఎర్రబియ్యం: ఒక కప్పు
నల్ల బెల్లం: రెండు కప్పులు
శొంటిపొడి: 1 టీస్పూన్‌
పచ్చి కొబ్బరి: ఒక కప్పు
నెయ్యి: తగినంత
జీడికప్పులు: పావు కప్పు
నీళ్లు: ఆరు కప్పులు

అరవణ ప్రసాదం తయారీ

ముందుగా పాన్‌ మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. మరో పాన్‌లో ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పులు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రబియ్యం బాగా శుభ్రంగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడికించే సమయంలోనే కాస్త నెయ్యి వేసుకోని కాస్త మెత్తగా వండుకోవాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. తర్వాత శొంటి పొడి, నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంత సేపు ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టేగీ ఉండే అవరణ పాయసం రెడీ.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z