ScienceAndTech

విద్యార్థులు తయారు చేసిన వియ్‌శాట్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

విద్యార్థులు తయారు చేసిన వియ్‌శాట్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

ఇంజినీరింగ్‌ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్‌ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి జనవరి 1న చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం ద్వారా 600 కి.మీ. ఎత్తు కక్ష్యలోకి శాస్త్రవేత్తలు దీనిని చేర్చనున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఉన్నికృష్ణ నాయర్‌కు వియ్‌శాట్‌ను అందించారు. కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లిజీ అబ్రహం ఆధ్వర్యంలో విద్యార్థినులు కిలో బరువుండే ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమి ఉపరితలంపై యూవీ కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే దీని లక్ష్యం. ఈ ఉపగ్రహం ఇచ్చే సమాచారాన్ని అధ్యయనం చేయడానికి కళాశాలలోనే గ్రౌండ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్తల సూచనలతో 250 మంది విద్యార్థినులు, ముగ్గురు అధ్యాపకులు మూడేళ్లపాటు కృషి చేసి ఉపగ్రహాన్ని రూపొందించారు. రూ.30 లక్షలు ఖర్చు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.4 లక్షలు చొప్పున విడుదల చేశాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z