కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు, నిర్వహణకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) టెండరు పిలిచింది. బిడ్‌ల దాఖలుకు జనవరి 10 సాయంత్రం 4 గంటల వరకు గడువుగా నిర్దేశించింది. ఈ ప్రాజెక్టుపై సందేహాల నివృత్తి, ఇతర అంశాలపై గుత్తేదారులతో బుధవారం చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ప్రీబిడ్ సమావేశంలో వచ్చిన సూచనల ఆధారంగా ఈ నెల 27లోగా టెండరు ప్రకటనలో ప్రతిపాదించిన మార్పులను సైట్‌లో ఏపీఏడీసీఎల్ ఉంచుతుంది. జనవరి 17న ఆర్థిక బిడ్‌లను పరిశీలించాక ఎంపికైన గుత్తేదారుకు ఎల్‌వోఏ, ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఏపీఏడీసీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.25.11 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఒప్పందం కుదుర్చుకున్నప్పటినుంచి ఏడాదిలో కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూములను 20 ఏళ్ల పాటు లీజు విధానంలో ఏపీఏడీసీఎల్ కేటాయిస్తుంది. ఆ తర్వాత మరో పదేళ్లు లీజు గడువు పొడిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఏపీఏడీసీఎల్ పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –