ప్రస్తుతం ‘సలార్’ (Salaar) పేరు ట్రెండింగ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అభిమానులంతా దీనికి సంబంధించిన విశేషాలను షేర్ చేస్తున్నారు. అలాగే చిత్రబృందం కూడా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై (Prithviraj Sukumaran) ప్రశంసలు కురిపించారు.
‘‘సలార్’లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సెకండ్ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నా. కానీ, ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. వెంటనే అంగీకరించారు. వరదరాజ మన్నార్ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం చాలా కసరత్తు చేశాం. బాలీవుడ్ నటులను తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. నేను మాత్రం పృథ్వీరాజ్‌నే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రేమ, ద్వేషం రెండూ చూపించగల నటుడు ఆయన మాత్రమే. పృథ్వీ ఒక సన్నివేశాన్ని నటుడి కోణంలోనే కాదు దర్శకుడిలా కూడా ఆలోచిస్తారు. ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని బిరుదు ఇవ్వొచ్చు. ‘సలార్’ కోసం ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే ‘సలార్’ లేదు’’ అని ప్రశాంత్ నీల్ అన్నారు.ఇక శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్’ రెండు భాగాలు తెరకెక్కింది. ఇప్పటికే అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదల చేసిన యాక్షన్ ట్రైలర్ వాటిని రెట్టింపు చేసింది. ఇక ఇందులో ప్రభాస్‌కు జోడిగా శ్రుతిహాసన్ (Shruti Haasan) నటించగా.. జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
👉 – Please join our whatsapp channel here –