Business

17 లక్షల కోట్ల పైగా యూపీఐ లావాదేవీలు

17 లక్షల కోట్ల పైగా యూపీఐ లావాదేవీలు

యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఆధారిత చెల్లింపుల విలువ డిసెంబరులో రూ.17.4 లక్షల కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తం 650 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు పేర్కొంది. వ్యాపార లావాదేవీల సంఖ్యలో 74 శాతం వృద్ధి కనిపించింది. నవంబరుతో పోలిస్తే డిజిటల్‌ లావాదేవీలు అధికంగా జరిగాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇ-కామర్స్‌ ఆర్డర్లలో యూపీఐ చెల్లింపులు 37 శాతం పెరిగాయి. ఈనెల 8 నుంచి విద్యా సంస్థలు, ఆసుపత్రులకు యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకూ చెల్లించే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. అంతకుముందు ఈ పరిమితి రూ.1 లక్షగా ఉండేది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z