DailyDose

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

రాష్ట్రంలో మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం అనే రెండు పేపర్లు ఉండటం వల్ల పరీక్ష రెండు రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా… అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌(ప్రశ్నపత్రం) ఉంటుంది. సైన్స్‌లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి జరుపుతున్నారు. దానివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రోజు అదనంగా పరీక్ష ఉంటే ఆరోజు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని విద్యాశాఖ భావించినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం గమనార్హం. త్వరలో దీనికి ఆమోదం లభించవచ్చని వారు భావిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z