కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అధికారుల బృందం రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్‌ల బృందం డిసెంబరు 22, 23 తేదీల్లో పర్యటిస్తుంది. సీఎస్, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉంటుుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల (Andhra Pradesh Assembly Elections 2024) నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23న సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
👉 – Please join our whatsapp channel here –