Politics

పింఛన్ల పేరుతో కోట్ల అవినీతి

పింఛన్ల పేరుతో కోట్ల అవినీతి

సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాయాజాలం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. నెల రోజుల్లో 19వేల మంది పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. అంకెల గారడీతో రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని, ఈ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘నవంబరు 2023లో రూ.2,750 చొప్పున 54,69,161 మందికి పింఛన్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. డిసెంబరు నెల వచ్చే సరికి 19,871 పింఛన్లు తగ్గిపోయాయి. ఒక నెల వ్యవధిలో పింఛన్లలో కోత పెట్టి రూ.291 కోట్లు కాజేశారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో పింఛన్లపై చర్చ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బయటకు వచ్చి నవంబరు నెలకు 65.33 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ, అర్హత ఉన్నవారికి కూడా పింఛన్లు నిలిపివేశారు’’ అని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z