Devotional

వేలంలో కిలో ఉప్పును 53వేలకు కొనుగోలు చేసిన భక్తుడు

వేలంలో కిలో ఉప్పును 53వేలకు కొనుగోలు చేసిన భక్తుడు

సాధారణంగా కేజీ ఉప్పు బ్రాండులను బట్టి రూ.30 లోపే ఉంటుంది. అయితే ఉత్సవాల్లో భాగంగా ఓ భక్తుడు కిలో ఉప్పును వేలంలో ఏకంగా రూ.53 వేలకు కొనుగోలు చేశాడు. తమిళనాడులో కరూర్ నగరత్తార్ సంఘం ఆధ్వర్యంలో ఏటా పిళ్లయార్ వ్రత దీక్ష ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం రోజున నోములు ప్రారంభించి, తాజాగా సోమవారం దీక్షను భక్తులు ముగించారు. వారు సమర్పించిన కానుకలను వేలం వేయగా ఉప్పుకు రికార్డు స్థాయి రేటు పలికింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z