Politics

పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సర్కార్‌

పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సర్కార్‌

పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన పథకాల్లో 98 శాతం నెరవేర్చారని పలు సందర్భాల్లో మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.. మెనిఫెస్టోలో లేకపోయిన కొన్ని కొత్త పథకాలను కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని చెబుతారు.. ఇక, సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ఉకటి.. ఈ పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్స్, వితంతువులకు పెన్షన్‌ అందిస్తూ వస్తున్నారు.. అంతేకాదు పెన్షన్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది జగన్‌ సర్కార్..

ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద నెలకు రూ.2750 నగదును ఇస్తూ వస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఆ పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వైఎస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆ ఉత్తర్వుల ప్రకారం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది రూ.3 వేల పెన్షన్‌.. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా సీఎం జగన్ వచ్చే జనవరి 2024 నుంచి వృద్ధాప్య పెన్షన్ ను కొత్త ఏడాది కానుకగా రూ. 3 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆ తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.. ఇక, దానికి అనుగుణంగానే తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో పెన్షన్‌ పెంపునకు ఆమోదముద్ర వేశారు.. ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z