Politics

మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలి!

మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలి!

మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలని.. అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్‌ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తాడని మతపెద్దలు దీవెనలు అందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు తమ ప్రభుత్వంలో రూ.50వేల ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు. క్రిస్మస్‌ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలని క్రిస్మస్‌ కానుకలు ఇచ్చామన్నారు. దేశంలో పేదరికం లేని సమాజం చూడాలనేది తన ఆకాంక్ష అని, అందుకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ చర్చిల్లో ప్రార్థనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z