DailyDose

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్

బీటెక్‌, ఎంటెక్‌ చివరి ఏడాది చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8, 9 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు సర్కారు పేర్కొంది. ఈ దిశగా 6,790 ఉన్నత పాఠశాలలను ఇంజినీరింగ్‌ కళాశాలలతో మ్యాపింగ్‌ చేసింది. ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలు చొప్పున కేటాయించనున్నారు. సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచిల వారు అర్హులు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, ట్యాబ్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. డిజిటల్‌ టెక్నాలజీ అనుబంధ సబ్జెక్టుల బోధనపై గురువులకు శిక్షణ ఇస్తారు. వీరిని ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌గా పిలుస్తారు. కృత్రిమ మేధ(ఏఐ), డేటా మేనేజ్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వెబ్‌-3.0 వంటి నైపుణ్యాలపై విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థికి నెలకు రూ.12 వేలతో పాటు కిలోమీటరుకు రూ.2 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు. జనవరి 6 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z