Politics

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన జగన్

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ  చేసిన జగన్

అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులే మన రాష్ట్ర భవిష్యత్.. 55 నెలలుగా ప్రభుత్వం ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు దిశగా పడ్డాయి.. తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు తీసుకుని వచ్చిన మార్పు ట్యాబ్ లు పంపిణీ అని ఆయన తెలిపారు. దశాబ్దకాలంలో ఆశించిన ఫలితాలు వస్తాయి.. ట్యాబ్ లు రిపేర్ కు వచ్చిన కంగారు పడొద్దు.. వారం రోజుల్లో తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉంది.. ట్యాబుల కంటెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెండాలిసిన అవసరం లేదు.. పిల్లల మేనమామగా వాటిని అందజేస్తున్నాను అని సీఎం జగన్ చెప్పారు.

నాడు- నేడు కింద డిజిటలైజేషన్ 62 వేల 97 క్లాస్ రూములు జనవరి 30కి పూర్తి అవుతుంది అని సీఎం జగన్ తెలిపారు. డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్ ట్యాబుల్లో ఉంచాం.. దాని ద్వారా సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలు నివృత్తి చేస్తున్నాం.. ఏపీలో పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలనే ప్రయత్నంలోనే మూడో తరగతి నుంచే టోఫెల్ తో ఒప్పందం చేసుకున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్స్ స్కిల్స్ పరిచయం చేసే విధంగా సబ్జెక్టును ప్రవేశ పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక మార్పులు తీసుకుని వస్తోంది.. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న చాలా ఉద్యోగాలు కానుమరుగుకానున్నాయి.. ఐబీ సిలబస్ ప్రవేశ పెడుతున్నాం.. ఐబీ సర్టిఫికేషన్ తీసుకుని వస్తాం.. జగన్ ఖర్చు పెట్టె ప్రతీ రూపాయి హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మేంట్.. విద్య మీద ఖర్చు పెడుతుంటే దుబారా చేస్తున్నారని గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు.

ద పిల్లల విద్య మీద ఇంతగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మరొకటి లేదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై మంచి పనులు చేస్తుంటే దుర్భిద్దితో బురద జల్లుతున్నారు.. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదు-చెడి పోతున్నారానే ప్రచారం చేస్తున్నారు.. పిల్లలు చేడిపోతున్నారని పనిగట్టుకుని నా మీద ప్రచారం చేస్తున్నారు.. పేద పిల్లలకు మేలు జరుగుతుంటే విషం చిమ్ముతున్నారు.. మీ పిల్లలు, మనవళ్ళు ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు వాడుతున్నప్పుడు పేద పిల్లల దగ్గర ఎందుకు ఉండకూడదు అని ఆయన ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదివితే తెలుగు అంతరించిపోతుందనే ప్రచారం ఎంత వరకు న్యాయం.. చంద్రబాబు ఆరు గ్యారెంటీలు ఇతర సంక్షేమ పథకాలు కలుపుకుంటే జగన్ ఇచ్చే దానికంటే వాళ్ళు చెప్పేది మూడు రెట్లు ఎక్కువ.. రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని రాతలు రాస్తున్న వాళ్లకు ఇవి కనిపించడం లేదా.. 2014-19ల మధ్య అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇక, మేనిఫెస్టో అందుబాటులో ఉంటే జనం కొడతారేమోనని భయపడి చంద్రబాబు ఇంటెర్నెట్ నుంచి తొలగించారు అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 2014-19మధ్య రాష్ట్రంలో గజదొంగల ముఠా రాజ్యం చేసింది.. స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ వరకు దోచుకోవడం, దాచుకోవడమే.. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా ఆలోచించమని కోరుతున్నాను.. మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు.. ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను అని ఆయన తెలిపారు. ఇక, ప్రజల సమక్షంలో సీఎం జన్మదిన వేడుకలు జరిగాయి. పిల్లలతో కలిసి జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి సభలో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z