ఎన్నో అడ్డంకులను దాటుకొని, జగన్ రెడ్డి కుళ్ళుకుతంత్రాలకి ఎదురొడ్డి ఆంధ్రులకు నేను ఉన్నానని, మీకోసం వస్తున్నా , మీ మాటే నా మాట, మీ గళమే నా గళం, ప్రతిఒక్కరి సమస్యను వింటూ , పరిష్కారాలు చూపుతూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ, ఈ 5 ఏళ్లల్లో జగన్‌రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియతమ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.
226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా మొత్తం 3,132 కి.మీ మేర నడిచి, పాదయత్రని ముగించి నవ శకానికి నాంది పలికిన నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకొంటూ, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆంధ్రప్రదేశ్‌ని తిరిగి అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, ఆంధ్రుల రాజధాని అమరావతిని త్వరగా పూర్తి చేసి, మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనేటట్టు చేయాలని కోరుకుంటూ ఎన్నారైలు మెల్బోర్న్‌లో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బలుసు కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎన్నారై సభ్యులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –