Politics

అయోధ్యలో పర్యటించనున్న మోదీ

అయోధ్యలో పర్యటించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) డిసెంబర్‌ 30న అయోధ్య (Ayodhya)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని అయోధ్య కమిషనర్‌ గౌరవ్‌ దయాల్‌ వెల్లడించారు. ఈ సభకు ముందు ప్రధాని అయోధ్య విమానాశ్రయాన్ని, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వందే భారత్‌తో పాటు రెండు రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని సభ ఏర్పాట్లను ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరిశీలించారని అధికారులు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z