DailyDose

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్ -తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

కాచిగూడ -కాకికనాడ టౌన్‌ రైలు (07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

కాకినాడ టౌన్‌- కాచిగూడ రైలు (07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.

హైదరాబాద్‌ -తిరుపతి రైలు (07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

తిరుపతి – హైదరాబాద్‌ రైలు (07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.

కాచిగూడ-కాకినాడ టౌన్‌-కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నం.07653/07654) మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గగుగంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

హైదరాబాద్‌ -తిరుపతి- హైదరాబాద్‌ ప్రత్యేక రైళ్లు (రైలు నం.07509/07510) సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z