Business

వందేభారత్‌ రైలు వేగాన్ని 15 నిమిషాలు పెంచిన అధికారులు

వందేభారత్‌ రైలు వేగాన్ని 15 నిమిషాలు పెంచిన అధికారులు

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పటివరకు ఈ రైలు గమ్యస్థానం చేరుకునేందుకు 8.30 గంటల సమయం పట్టేది. ఇకపై 8.15 గంటల్లో చేరుకోనున్నది.

ఈ మార్పు గురువారం నుంచే అమలు కానున్న నేపథ్యంలో సబర్బన్‌ ప్రయాణికుల కోసం ఎంఎంటీఎస్‌ లోకల్‌ సర్వీసులు ప్రతిరోజు ఉదయం కాచిగూడకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. లింగంపల్లి-ఉమ్దానగర్‌ స్టేషన్ల మధ్య సర్వీసులు ఉదయం అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. వందేభారత్‌ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు కొనసాగిస్తున్నదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z