Devotional

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన యాదాద్రి

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన యాదాద్రి

వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 6.48గంటలకు యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.

పాతగుట్ట (పూర్వగిరి) లక్ష్మీనారసింహ స్వామి వారు ఉత్తర రాజగోపురం గుండా 6.48గంటలకు వైకుంఠనాథుడి దర్శనం ఇవ్వనున్నాడు. స్వామివారి అధ్యయనోత్సోవాలను 23నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z