Kids

ఓ చిన్నారికి పాపకు కరోనా!

ఓ చిన్నారికి పాపకు కరోనా!

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఓ పక్కన వైద్యులు భయపడొద్దు అంత తీవ్ర స్తాయిలో లేదు, కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. కానీ వ్యాప్తి మాత్రం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడూ ఎవ్వరికీ కరోనా పాజిటివ్‌​ వచ్చినా అది కరోనా కొత్త వేరియంటేనని భయపడే పరిస్థితి. ఓ పక్క మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించమని ఇప్పటికే ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ సైతం దీని గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా ఓ ఆరేళ్ల పాపకు కరోన పాజిటివ్‌ రావడం వైద్యులను మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ ఓ ఆరు నెలల పాపతో సహా ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బీహార్‌కు చెందిన ఆ చిన్నారి కోల్‌కతాలోని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ చికిత్స పొందుతుండగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారందరికి వచ్చింది కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

దీన్ని ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ద్వారా నిర్థారిస్తున్నారు. ఈ ఘటనతో వైద్యులు కేసులను కుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇన్‌ఫ్లుఎంజా అనారోగ్యం(ILI)కి సంబంధించిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతేగాక పశ్చిమబెంగాల్‌ ఆరోగ్య అధికారుల ఈ కొత్త వేరియంట్‌ కేసులపై గట్ట నిఘా పెట్టడమే గాక నివారించేలా కట్లుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z