Devotional

ఈ రాశివారు ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది-రాశిఫలాలు

ఈ రాశివారు ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది-రాశిఫలాలు

మేషం

వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. శుభ గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త పద్ధ తులు ప్రవేశపెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. తల్లితండ్రుల సహకారంతో సోదరులతో ఆస్తి వివా దం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపుతో పాటు, కెరీర్ పరంగా ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి జీవితం మూడు పూవులు ఆరు కాయలు అన్నట్టుగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారం ఒకటి సానుకూలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువర్గం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు.

మిథునం

ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండవు. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబసమేతంగా ఆధ్మాత్మిక సేవల్లో పాల్గొం టారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదలే తప్ప తరుగుదల ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడు తుంది.

సింహం

ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయప్రయాసలు తప్పవు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవ కాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. కొద్దిపాటి పురోగతి కూడా ఉంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు.

కన్య

ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యో గులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. జీవిత భాగ స్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల

అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి, అంచనాలకు మించి ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఉద్యో గంలో అధికారులతో అధికారాలను, బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు విదే శాల్లో స్థిరపడే సూచనలున్నాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. జీతభత్యాల్లో మార్పులు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలని స్తాయి.

వృశ్చికం

కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల తీరుతెన్నులు మారిపోతాయి. లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

ధనుస్సు

సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి లోటుండదు. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మకరం

ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యక్తి గతంగా కూడా కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాదాపు ప్రతిదీ మీరనుకున్నట్టే జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం

వ్యక్తిగత సమస్య ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపో తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవు తాయి.

మీనం

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. శత్రువులు, ప్రత్య ర్థులు, పోటీదార్లు చాలావరకు తగ్గి ఉంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ సేవా కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z