ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్/డిగ్రీ/పీజీ అర్హతతో మొత్తం 99 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18న రాత్రి 11.59గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని APPSC స్పష్టం చేసింది. ఆయా విభాగాల్లో అధ్యాపక పోస్టులను బట్టి అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/తదితర కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయో పరిమితి 18 నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు కల్పించారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు వేతనం రూ.56,100 నుంచి రూ.98, 400 మధ్య చెల్లించనున్నారు.
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.370 (అప్లికేషన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చొప్పున(ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు) చెల్లించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. మెయిన్ రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. పూర్తి వివరాలు ఈ కింది పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –