Business

పోకో ఎమ్‌6 5జీ పేరుతో కొత్త మొబైల్ భారత్‌ మార్కెట్లో లాంచ్

పోకో ఎమ్‌6 5జీ పేరుతో కొత్త మొబైల్ భారత్‌ మార్కెట్లో లాంచ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ పోకో (Poco) బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్‌ చేసింది. పోకో ఎం6 5జీ (Poco M6 5G) పేరుతో కొత్త మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6100 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

పోకో ఎం 6 5జీ స్మార్ట్‌ ఫోన్‌ మూడు వేరియంట్లలో రానుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.11,499గా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.13,499గా పేర్కొంది. గెలాక్సీ బ్లాక్‌, ఓరియన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. డిసెంబరు 26 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ సాయంతో కొనుగోలు చేసిన వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్లు పేర్కొంది.పోకో కొత్త ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్‌ రేటుతో రానుంది. ఆండ్రాయిడ్‌ 13 (Android 13) ఆధారిత ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌ ఇచ్చారు. ఇక కెమెరా విషయాలకొస్తే.. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీ కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌, బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z