ఓ ప్రముఖ ప్రైవేట్ ఛానల్ నిర్వహించే సినీ గీతాలాపన పోటీ “సూపర్ సింగర్”కు అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర డెట్రాయిట్‌కు చెందిన కర్నూలు ప్రవాస తెలుగమ్మాయి సుధ వైష్ణవి ఎంపిక అయింది. ఈ పోటీలో పాల్గొనే 15 మందితో కలిసి వైష్ణవి తలపడనుంది.
పద్మ సుందర్-మదురై సుందర్ వద్ద శాస్త్రీయ సంగీత విద్యనభ్యసించిన సుధ అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొని గెలుపొందింది. “నాటా ఐడల్” రన్నరప్‌గా నిలిచింది. “గానవిశారద” బిరుదును కూడా అందుకుంది. “సూపర్ సింగర్” పోటీలో సుధ వైష్ణవి గెలుపొందాలని ప్రవాసులు అభినందనలు అందజేస్తున్నారు.