సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టారని.. కానీ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సపోర్టర్ అంటూ ఆరోపించారు. వంద కోట్లకు, వెయ్యి కోట్లకు అమ్ముడు పోవడమా అంటూ విమర్శలు గుప్పించారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ మూసేసారని, షర్మిల పార్టీ మూసేసారని, ఆయన కూడా మూసేస్తారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు నా పార్టీలో చేరారన్నారు.
గతంలో కూడా కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు.. తాను తప్ప వేరే ఎవరు తీర్చలేరని కేఏ పాల్ తెలిపారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేరని.. సాకులతోనే కాలం గడిపేస్తారంటూ చెప్పుకొచ్చారు. దేశంలో, రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని కేఏ పాల్ సూచించారు. ప్రజాశాంతి పార్టీకి త్వరలోనే గుర్తు కూడా రానుందని కేఏ పాల్ వెల్లడించారు. ఇక.. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ.1000 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. గతంలో.. తనను విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షా కోరారని.. కానీ తాను వెళ్లలేదని కేఏ పాల్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –